కేసీఆర్ కుటుంబం జోలికొస్తే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ఎన్నో త్యాగాలకు పాల్పడిందని , కేసీఆర్ స్వయంగా చావునోట్లో తల పెట్టాడని అలాంటి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే , రాజకీయంగా సమాధి చేయాలనీ చూస్తే సహించేది లేదని రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని హెచ్చరించాడు.
కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేక కవితను బీజేపీ టార్గెట్ చేసిందని , బ్యాంక్ లలో వేల కోట్ల అప్పు తీసుకొని ముంచిన వాళ్ళను వదిలేసి తెలంగాణ కోసం కష్టపడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని మోడీ సర్కారు చూస్తోందని , కేసీఆర్ వెంట యావత్ తెలంగాణ ఉందని ……. ఎన్ని వేషాలు వేసినా ప్రజల మద్దతు కేసీఆర్ కు మాత్రమే ఉంటుందన్నాడు. కవిత ను జైల్లో పెడితే తెలంగాణ అగ్ని గుండం అవుతుందన్నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్.