కుక్కలు అడ్డురావడంతో BRS ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి గాయాలయ్యాయి. దాంతో ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించారు అనుచరులు. ఈ సంఘటన ఈరోజు కీసర రింగు రోడ్డులో జరిగింది. ఓ వేడుక కోసం కీసర వెళ్ళాడు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. కార్యక్రమం అయ్యాక తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు కు కుక్కలు అడ్డుగా వచ్చాయి.
వేగంగా వెళ్తున్న కారుకు అడ్డుగా కుక్కలు రావడంతో సడెన్ బ్రేక్ వేసాడు డ్రైవర్. దాంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు కు మరో కారు గుద్దుకోవడంతో రెండు కార్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. అలాగే సడెన్ బ్రేక్ వేయడంతో ఎమ్మెల్యే కాళ్లకు గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లారు. ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్ జరిగింది అనే విషయం క్షణాల్లో అందరికీ తెలియడంతో ఎమ్మెల్యేకు ఏమైంది అనే ఆత్రుత నెలకొంది. దాంతో వాకబు చేయడం మొదలు పెట్టారు. అయితే తనకు పెద్దగా గాయాలు కాలేదని అంతా బాగానే ఉందని చెప్పడంతో శాంతించారు కార్యకర్తలు.