
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా తగినంత మెజారిటీ రాదని, తెలంగాణలో హంగ్ ఏర్పడనుందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసాడు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాగా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు అచ్చంపేట ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం లో ఉన్నాయని , కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని , తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టించాలని ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని , అయితే విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితిని మాత్రమే అధికారంలోకి తీసుకొస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఒకరికొకరికి అస్సలు పొసగదని దాంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ….. పాదయాత్రలు , బైక్ యాత్రలు ఎన్ని చేసినా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారన్నారు.