తెలంగాణ తలవంచదు
ఇది ఎమ్మెల్సీ కవిత పెట్టిన ట్వీట్. ఈడీ తనకు నోటీసులు పంపించిన వెంటనే ట్విట్టర్ లో” తెలంగాణ తలవంచదు ” అంటూ ముక్తసరిగా ట్వీట్ పెట్టింది. దాంతో ఈ ట్వీట్ పై నిప్పులు చెరిగాడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నీకు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణకు ఏం సంబంధం……. తెలంగాణ ఎందుకు తలవంచుతుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు తెలంగాణకు ఏం సంబంధం ? నీకు నోటీసులు వస్తే మొత్తం తెలంగాణ ఎందుకు బాధ్యత వహిస్తుంది ? అంటూ గరమయ్యాడు రఘునందన్ రావు.
ఇక బీజేపీ నాయకులు బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మంత్రి అరుణ తదితరులు కూడా ఘాటుగా స్పందించారు. మీకు ఏదైనా ఆపద వస్తే వెంటనే తెలంగాణ గుర్తుకు వస్తుందా ? తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నారా ? కేసుకు తెలంగాణ సెంటిమెంట్ కు ఏం సంబంధం అంటూ నిప్పులు చెరిగారు. కవిత ఎన్ని మ్యాజిక్కులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
Telangana will never bow down!!!
What is the link between Telangana and the ED notice you received for scams??
If you receive a notice for that scam, does Telangana as a whole have to accept the responsibility…??
Whoever is responsible for scams need to bow before the law. https://t.co/sIVGAwx60o
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) March 8, 2023