ఎమ్మెల్సీ కవితను మొదటగా విచారిస్తారని , ఆమె నుండి సరైన సమాచారం లభించకపోతే అరెస్ట్ తప్పదని సంచలన వ్యాఖ్యలు చేసాడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ నాయకుడైన రఘునందన్ రావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు క్రిమినల్ లాయర్ కూడా అనే విషయం తెలిసిందే. దాంతో ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏమేమి జరగబోతోంది అనే విషయాలను కూలంకషంగా వివరించాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ప్రమేయం ఉందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆరోపణలకు తగ్గట్లుగా కవిత సన్నిహితుడు బోయినపల్లి అభిషేక్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కవిత అరెస్ట్ కూడా తప్పదని అంటున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక అడుగు ముందుకు వేసి ……. సీబీఐ విచారణ ఎలా జరుగనుంది …… కవితను ఎలా ఎప్పుడు అరెస్ట్ చేయనున్నారు అన్నది వివరించాడు.