ఈడీ నోటీసులు అందుకొని విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల దదీక్ష విరమించాడు. అయ్యప్ప మాలలో ఉన్న రోహిత్ రెడ్డి సమీప బంధువు అకాల మరణంతో దీక్ష విరమించాల్సి వచ్చింది. అయ్యప్ప మాల ధరించిన సమయంలో సమీప బంధువు చనిపోతే దీక్ష విరమిస్తారనే విషయం తెలిసిందే.
ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు రోహిత్ రెడ్డి. మొత్తం 13 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న రోహిత్ రెడ్డి ఈడీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫిర్యాదు చేసిన నన్ను విచారించడం విచిత్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసాడు. రెండు రోజుల పాటు విచారించిన ఈడీ మళ్ళీ ఈనెల 27 న హాజరు కావాలని కోరడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి తదుపరి విచారణపై చర్చించనున్నారు.