
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు విచారణ కోసం వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే విచారణ కోసం ఉదయం 10 గంటలకు తుగ్లక్ రోడ్డు లోని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం నుండి బయలుదేరి వెళ్లనుంది. అయితే అంతకంటే ముందు ఉదయం 7: 30 నిమిషాలకు భారత జాగృతి కార్యకర్తలకు అల్పాహారం ఏర్పాటు చేసింది కవిత.
తనతో దాదాపు 18 సంవత్సరాలుగా ప్రయాణం కొనసాగిస్తున్న భారత జాగృతి కార్యకర్తలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనుంది. జాగృతి కార్యకర్తలకు పెద్ద ఎత్తున బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసింది. ఇక బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో పలువురు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారట. అక్కా మీ కోసం ఎంత వరకైనా తెగిస్తాం …… పోరాడతాం అంటూ నినదించారట. కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున జాగృతి నాయకులు , కార్యకర్తలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. వాళ్లందరికీ ఈరోజు తన ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసింది కవిత.