
ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాలా ? వద్దా ? అని తీవ్ర తర్జన భర్జన అనంతరం ఈడీ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకుందట. అందుకే ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లాలని డిసైడ్ అయ్యిందట. ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం వల్ల ఈడీ తీవ్ర నిర్ణయం తీసుకొచ్చని …… అరెస్ట్ కు కూడా వెనుకాడకపోవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈనెల 11 న కవితను ఈడీ విచారించింది. అయితే మళ్ళీ ఈనెల 16 న కవితను విచారణకు హాజరు కావాలని కోరారు. కానీ ఆరోజు కవిత డుమ్మా కొట్టింది. దాంతో ఈనెల 20 న విచారణకు రావాలని కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక ఆరోజు రానే వచ్చింది. ఈడీ విచారణకు వెళ్లాలా ? వద్దా ? అని ఆలోచించిన కవిత ఎట్టకేలకు విచారణకు హాజరు కావాల్సిందే అని డిసైడ్ అయ్యిందట. కవిత సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈనెల 24 న సుప్రీం లో కవిత పిటీషన్ పై తీర్పు వెలువరించనుంది. కవిత వెంట మంత్రి కేటీఆర్ , ఎంపీ సంతోష్ కుమార్ లు ఢిల్లీ వెళ్లారు.






