
ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను విచారించింది ఈడీ. విచారణ పూర్తి కావడంతో చిరు నవ్వు చిందిస్తూ బయటకు వచ్చింది. అందరికి అభివాదం చేసింది. దాంతో గులాబీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ కవితను విచారించింది. ఇక మరోసారి కూడా కవితను విచారణకు హాజరు కావాలని ఈడీ కోరనుంది. అయితే తదుపరి విచారణ ఎప్పుడు ? ఏంటి ? అన్నది తెలియాల్సి ఉంది. రేపు ఉగాది పండుగ కాబట్టి హైదరాబాద్ కు బయలు దేరనున్నట్లు తెలుస్తోంది.