కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ అధికారులు నిన్న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. దాంతో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు తరలివచ్చి కవితకు సంఘీభావం తెలిపారు. ఇన్నాళ్లు తెలంగాణ జాగృతి తెలంగాణకు మాత్రమే పరిమితమైందని , ఇకపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేయాల్సిందే అంటూ తీర్మానించారు.
తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలిపిన కవిత తెలంగాణ జాగృతిని విస్తరిస్తామని స్పష్టం చేసింది. ఇక పనిలో పనిగా మోడీ సర్కారు పై నిప్పులు చెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న కవులను , కళాకారులను జాగృతం చేసి ఉద్యమం తరహాలో ఏకం చేస్తామన్నది.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేవలం నాపై మాత్రమే దాడులు చేయించడం లేదు …… కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాడులు చేస్తున్నారు. మనపై జరిగిన దాడికి మూడింతలు చేసి చూపించాలి. తెలంగాణ ఆడపిల్లల కళ్ళ నుండి కన్నీళ్లు కాదు నిప్పులు వస్తాయని మోడీ సర్కారును హెచ్చరించింది కవిత.