
ఎమ్మెల్సీ కవిత మహిళల రిజర్వేషన్ ల కోసం రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటూ దీక్ష స్టార్ట్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి కానీ మహిళల రిజర్వేషన్ లకు బదులుగా రాజకీయ వేదికగా మారనుంది ఆ వేదిక.
ఎందుకంటే …….. మహిళా రిజర్వేషన్ల కోసం దీక్ష చేపడుతున్నట్లుగా కవిత ప్రకటించింది కానీ అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దాంతో ఈ వేదికలో మహిళలకు రిజర్వేషన్లు అనే అంశం పక్కకు పోయి కవితను వేధించే అంశం , అరెస్ట్ వ్యవహారాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది.
కవిత చేపడుతున్న ఈ దీక్ష కు మొత్తంగా 16 పార్టీలు మద్దతు ప్రకటించాయి. జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షా శిభిరంలో ఉభయ కమ్యూనిస్ట్ లకు చెందిన నాయకులతో పాటుగా నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ , ఆమ్ ఆద్మీ పార్టీ , జేడీయు , తృణమూల్ కాంగ్రెస్ , ఆర్జేడీ , సమాజ్ వాదీ పార్టీ , ఎన్సీపీ , శివసేన ,రాష్ట్రీయ లోక్ దళ్ ఝార్ఖండ్ ముక్తి మోర్చా , కపిల్ సిబాల్ తదితరులు హాజరు కానున్నారు. ఇక ఈ దీక్ష ప్రారంభం సీతారాం ఏచూరి సమక్షంలో జరుగనుంది. అలాగే దీక్ష విరమణ మాత్రం సిపిఐ నేత డి. రాజా సమక్షంలో చేయనుంది కవిత.