ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి MLC కవిత పేరు చేర్చారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కవిత పేరు చేర్చారు ఈడీ అధికారులు. నిన్న రాత్రి ఢిల్లీ లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా మాగుంట రాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్టు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్ళై వ్యవహరించారని , అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా రాఘవ రెడ్డి కలిసినట్లుగా ఈడీ రిమాండ్ రిపోర్టు లో పేర్కొంది. కవిత పేరు మరోసారి రిమాండ్ రిపోర్టు లో రావడంతో కవిత అరెస్ట్ జరుగనుందా ? అనే చర్చ జరుగుతోంది.