
ఈరోజు మరోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవితను రావాలని ఆదేశించారు. దాంతో మరోసారి ఈడీ ముందుకు వెళ్లనుంది. అయితే అంతకంటే ముందు మీడియా సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యింది కవిత. దాంతో కవిత మీడియా ముందు ఏం చెప్పబోతోంది ? అనే ఆత్రుత మొదలైంది. ఈ ప్రెస్ మీట్ లో తప్పకుండా ఈడీ పై అలాగే మోడీ ప్రభుత్వం పై నిప్పులు చెరగడం ఖాయమని భావిస్తున్నారు.
ఒక మహిళగా నాకు ఈ దేశ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందని , అయితే ఆ హక్కులను ఈడీ హరించి వేస్తోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేస్తోంది. అయితే మిగతా విచారణ సంస్థలకు పరిమితులు ఉంటాయేమో కానీ ఈడీ కి అలాంటి పరిమితులు లేవని అంటున్నారు న్యాయ నిపుణులు. కానీ కవిత మాత్రం ఇదే వాదనతో సుప్రీం తలుపు తట్టింది. ఆ కేసు విచారణ ఈనెల 24 న చేపట్టనుంది. ఈలోపు ఈడీ కవితను అరెస్ట్ చేస్తుందా ? లేక ఇలా విచారణ పేరుతో మళ్ళీ మళ్ళీ పిలిచి 24 తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటుందా ? చూడాలి. మొత్తానికి కొద్దిసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతోంది. ఏం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.