
MLC కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఉదయమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్లిన కవిత ఉదయం 9.30 నిమిషాలకు ఢిల్లీలో అడుగుపెట్టారు. రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉండటంతో ఈరోజు ఉదయమే ఢిల్లీ వెళ్ళింది.
ఈరోజు దాదాపు 15 పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు కవిత. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 న జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు మహిళా బిల్లు కోసం మరింతగా డిమాండ్ చేయాలనే లక్ష్యంతో సమావేశం నిర్వహిస్తోంది కవిత.
ఈ సమావేశం అయ్యాక రేపటి ఈడీ విచారణ కోసం సమాయత్తం కానుంది. రేపు ఉదయం ఈడీ కార్యాలయానికి విచారణ కోసం వెళ్లనుంది. ఈనెల 11 న కవితను దాదాపు 9 గంటల పాటు విచారించింది. మరి రేపు ఎన్ని గంటల పాటు విచారణ సాగనుందో ? కవిత అరెస్ట్ ఖాయం అంటూ సాగుతున్న ప్రచారం నిజం అవుతుందా ? లేదా ? అన్నది రేపు తెలియనుంది.