
ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని సంచలన ఆరోపణలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనని అరెస్ట్ చేయకుండా , విచారణ కూడా చేయకుండా ఈడీ కి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే విచారణ దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని కవిత వాదనను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు.
ఈడీ సాక్ష్యులను బెదిరించి , కొట్టి ఆరోపణలు చేయిస్తోందని , చందన్ రెడ్డి ని ఈడీ కొట్టిందని , అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళైని బెదిరించి నాపేరు చెప్పించారని , నాకు సంబంధం లేని కేసులో నాపై ఆరోపణలు చేయించి అరెస్ట్ చేయాలని ఈడీ చూస్తోందని , ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న ఆట అని అందువల్ల సుప్రీం జోక్యం చేసుకోవాలని పిటీషన్ దాఖలు చేసింది కవిత.
ఒక మహిళను విచారించే పద్దతి ఇదేనా ? వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేయాలనీ , లేదంటే నా ఇంట్లో విచారణ చేసినా ఫరవాలేదని …. నా ఫోన్ ను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ….. ఈడీ చట్ట విరుద్దంగా విచారణ చేస్తోందని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసింది. కవిత పిటీషన్ పై సుప్రీం కోర్టు ఈనెల 24 న విచారణ చేయనుంది. దాంతో రేపు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే.