
మార్చి 13 న ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు కావడంతో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. అలాగే పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణ వైద్య , ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసాడు. ఇంకేముంది కవిత కూడా రీ ట్వీట్ చేసింది ”థాంక్యూ బావా ”అంటూ ….. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల కవిత ఢిల్లీ వెళ్లిన సమయంలో లిక్కర్ కేసులో ఆమెను అరెస్ట్ చేయకుండా లాయర్ల చేత సంప్రదింపులు జరిపి ఈడీ విచారణ ఎలా ఉంటుంది ? వాటికి ఎలా సమాధానాలు ఇవ్వాలనే విషయంలో తీవ్ర తర్జన భర్జన లు పడ్డారు హరీష్ రావు , కేటీఆర్ . ఈడీ విచారణను సమర్థవంతంగా ఎదుర్కొని కవిత ఇంటికి తిరిగి రావడంతో గులాబీ శ్రేణులు అలాగే కల్వకుంట్ల కుటుంబ సభ్యులలో సంతోషం వెల్లివిరిసింది. ఇక మరోసారి ఈడీ విచారణ కోసం రేపు అనగా మార్చి 15 న ఢిల్లీకి వెళుతోంది కవిత. ఈనెల 16న మళ్ళీ ఈడీ కవితను విచారించనుంది.