
ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈనెల 20 న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దాంతో ఈనెల 24 వరకు ఎదురు చూడకుండా ఈరోజే విచారించి తనని విచారించకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది కవిత.
ఇంతకుముందు సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. అయితే ఈడీ కి నోటీసులు ఇవ్వడానికి నిరాకరించింది కాకపోతే ఈనెల 24 న విచారిస్తామని తెలిపింది. అయితే నిన్న ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కవిత విచారణకు డుమ్మా కొట్టింది. అంతేకాదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు విచారణకు రానని తేల్చి చెప్పింది. అయితే ఈడీ ఈనెల 20 న మరోసారి విచారణకు రావాల్సిందే అని తాజా నోటీసులు పంపించింది.
ఇక ఈ నోటీసులు కవితకు అందడంతో తప్పకుండా విచారణకు వెళాల్సి ఉండటంతో ఆ నోటీసులపై స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీంను ఆశ్రయించనుంది. కవిత రిట్ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.