
ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో కవితను ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
ఒక మహిళను అయిన నన్ను రాత్రి 10 గంటల వరకు విచారించడం తగదు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. నేను ఈడీ విచారణకు హాజరుకాను , ఒకవేళ విచారించాలంటే నా ఇంటికి వచ్చి విచారించవచ్చు అంటూ పేర్కొంది కవిత. ఎమ్మెల్సీ కవిత తరుపున కపిల్ సిబాల్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు కవిత పిటీషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది. ఈలోపు తమ పూర్తి వాదనలను లిఖిత పూర్వకంగా కోర్టుకు సమర్పించాలని అటు కవితకు ఇటు ఈడీ కి ఆదేశాలు జారీచేసింది. దాంతో కవిత రిట్ పిటీషన్ ఏప్రిల్ 15 తర్వాత విచారణకు రానుంది.