
ఈరోజు విచారణకు హాజరుకాను అంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాసింది. ఒక మహిళను విచారించాలంటే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలి. అలాగే మహిళను విచారించాలంటే ఇంటి దగ్గరే విచారించాలని అందుకే నేను విచారణకు రావడం లేదని కవిత ఈడీ కి లేఖ రాసింది. కవిత లేఖ సంచలనంగా మారింది.
సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేసాను కాబట్టి సుప్రీం తీర్పు వెలువరించే వరకు విచారణకు హాజరు కానని తేల్చిచెప్పింది కవిత. ఒక మహిళగా రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటానని స్పష్టం చేసింది కవిత.
కవిత లేఖతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలయ్యింది. అలాగే కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కూడా కలకలం సృష్టిస్తోంది. కవిత విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ ఎలా ముందడుగు వేస్తుంది అనే చర్చ మొదలైంది. ఈడీ తలుచుకుంటే కవితను అరెస్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. అయితే ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే చర్చ సాగుతోంది.