
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు పొక్కడంతో వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని , లేదంటే కేసీఆర్ ఆమెని వెంటనే పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని కవిత ఇంటిని చుట్టుముట్టడానికి వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.