బేగం పేట – నెక్లెస్ రోడ్ లో భారీ ప్రమాదం నుండి బయటపడింది ఎం ఎం టీఎస్ ట్రైన్. బేగం పేట దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ శబ్దాలతో ట్రైన్ ఆగిపోయింది. భారీ శబ్దాలు రావడంతో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దాంతో ట్రైన్ ఆగిన వెంటనే హాహాకారాలు చేస్తూ ట్రైన్ దిగి పారిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాకపోవడంతో కొంతమంది ఆందోళనకు లోనయ్యారు. అయితే స్పందించిన దక్షిణ మధ్య రైల్వే సాంకేతిక లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని , ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అలాగే రైళ్ల పునరుద్ధరణ జరిగిందన్నారు.
Breaking News