భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బూతుల ఆడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డాక్టర్ చెరుకు సుధాకర్ ను నా మనుషులు చంపడానికి తిరుగుతున్నారని , వంద వాహనాల్లో నా మనుషులు తిరుగుతున్నారని బండ బూతులు తిట్టాడు. చెరుకు సుధాకర్ కొడుకు డాక్టర్ సుహాస్ కు ఫోన్ చేసి బూతులు తిట్టాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న గాక మొన్నొచ్చిన చెరుకు సుధాకర్ నాపై విమర్శలు చేస్తాడా ? వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేసాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే సుధాకర్ కొడుకు డాక్టర్ సుహాస్ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సముదాయించే ప్రయత్నం చేసాడు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం మాత్రం చల్లారలేదు.
డాక్టర్ చెరుకు సుధాకర్ కు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి రాజకీయంగా చాలా విబేధాలు ఉన్నాయి. ఇక చెరుకు సుధాకర్ కూడా చాలాకాలం పాటు TRS లో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్ తో తీవ్రంగా విబేధించి బీజేపీ లో కొన్నాళ్ళు పని చేసాడు. ఆ తర్వాత లాభం లేదని తెలంగాణ సొంత ఇంటి పార్టీ పెట్టాడు. గత ఏడాది రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే తన బద్ధ వ్యతిరేకి అయిన చెరుకు సుధాకర్ ను తనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ BRS తో పొత్తు పెట్టుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్రంగా గాయపరిచాయి. దాంతో ఆ వ్యాఖ్యలను డాక్టర్ చెరుకు సుధాకర్ ఖండించాడు. ఇంకేముంది కోమటిరెడ్డి కి విపరీతమైన కోపం వచ్చింది. ఇక తన అనుచరులు ఊరుకోవడం లేదని , చెరుకు సుధాకర్ ను చంపేస్తారని కోమటిరెడ్డి హెచ్చరించిన ఆడియో కాంగ్రెస్ శ్రేణులను కలవరానికి గురి చేసింది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో.