మునుగోడులో ఉప ఎన్నికకు రంగం సిద్దమైన నేపథ్యంలో అక్కడి ఓటర్లకు ఎక్కడలేని గిరాకీ వచ్చింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దసరా రాకముందే దసరా పండగ చేస్తున్నారు ఓటర్లకు. మందు బాటిల్ తో పాటుగా కోడి ని ఉచితంగా ఇస్తున్నారు. మందు బాటిల్ , కోడి ఇస్తుండటంతో జనాలు పోటీ పడ్డారు.
మునుగోడులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 3 న ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 6 న ఫలితాలు ప్రకటించనున్నారు. దాంతో పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింతగా పెంచాయి. ఇక మునుగోడులో ఓటర్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ మరింతగా ఇలా ముందంజలో ఉంది మద్యం , కోడి పంచుతూ.