
ప్రపంచ కుబేరుడుగా పేరుగాంచిన 8 వ నిజాం వారసుడు మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ ( 89 ) జనవరి 14 న టర్కీ లోని ఓ అద్దె ఇంట్లో మరణించాడు. హైదరాబాద్ సంస్థాన వారసుడు , ప్రపంచంలోనే అపర కుబేరుడు అయిన ముకరంజా అద్దె ఇంట్లో ఉండటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన నిజాం నవాబుల వారసుడు 8 వ నిజాం రాజు అయిన ముకరంజా 1971 లో భారత ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేయడంతో పాటుగా నలుగురు భార్యలకు విడాకులు ఇవ్వడంతో అటు పిల్లలకు ఇటు భార్యలకు భరణం చెల్లించాల్సి రావడం…….. అలాగే స్థిరచర ఆస్తులన్నీ కోర్టు వివాదాల్లో ఉండటంతో ఆస్తులు కర్పూరం లా కరిగిపోయాయి.
ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ గా విలసిల్లిన ముకరంజా విలాసవంతమైన జీవితం గడపడం అలాగే ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చివరి రోజుల్లో సామాన్యుడిగా అద్దె ఇంట్లో బ్రతకాల్సి వచ్చింది. టర్కీలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో అద్దెకు ఉన్న ముకరంజా చివరి కోరిక హైదరాబాద్ లోనే తనని సమాధి చేయాలని. దాంతో ఆయన చివరి కోరిక మేరకు టర్కీ నుండి హైదరాబాద్ కు ముకరంజా పార్దీవదేహాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో రేపు అనగా జనవరి 18 న మక్కా మసీదు లో నిజాం నవాబులు అసఫ్ జాహీ ల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.






