రేపు హోళీ పండుగ కావడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ విషయం కొంతమందికి తెలియక మూసి ఉన్న వైన్ షాపులను చూస్తూ బోరున విలపిస్తున్నారు. సాయంత్రం అయితే చుక్కేస్తేనే కానీ ముద్ద దిగని మద్యం రాయుళ్లు లబోదిబోమంటున్నారు. అయితే ఈ విషయం నిన్ననే తెలిసిన వాళ్ళు మాత్రం ఎంచక్కా ముందే తమకు కావాల్సిన సరుకును కొని పెట్టుకున్నారు.
అసలే రేపు హోళీ పండుగ దాంతో ముఖానికి రంగులు పూసుకోవడమే కాదు …….. ఆ రంగులు కడుక్కున్నాక ఫుల్లుగా మద్యం తాగడమే అలవాటు కొందరికి. అంతేనా ……… మరికొంతమంది రంగులు పూసుకుంటూనే మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా పండగను చేసుకునే వాళ్ళు కొందరైతే …….. పేద ప్రజలు అందునా కష్టం చేసిన వాళ్ళు మాత్రం పొద్దంతా కష్టం చేసి రాత్రి అయితే చాలు గుటుక్కున ఆ మందు తాగి ఇంత తిని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. పాపం అలాంటి వాళ్ళకే కష్టాలు వచ్చి పడ్డాయి ఇప్పుడు. దాంతో మద్యం షాపులు బంద్ అయ్యాయని తెలుసుకొని తెగ బాధపడుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం అంటే అతిశయోక్తి కాదు సుమా ! అంత దారుణంగా ఉంది మరి పరిస్థితి.