
ఈరోజు ప్రగతి భవన్ కు వెళ్లనుంది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఆ కేసులో ఎలా వ్యవహరించాలి అని చర్చించడానికి తన తండ్రి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు చేరుకోనుంది. ఇక కవితతో పాటుగా కేటీఆర్ , హరీష్ రావు లు సైతం ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
కేసీఆర్ , హరీష్ రావు , కేటీఆర్ , కవిత లతో పాటుగా పలువురు న్యాయవాదులు , తెలంగాణ ఏజీ తదితరులు పాల్గొని చర్చించనున్నారు. ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించవచ్చు. ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే అసలు ఈడీ విచారణకు వెళ్లకుండా ఉండటానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనే వాటిపై కూడా ఆలోచన చేయనున్నారట. అయితే కవిత విచారణకు రాకుండా ఎన్ని సార్లు తప్పించుకోవాలని చూస్తే ……. అంతగా …… మరింతగా కేసులో ఇరుక్కున్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. విచారణకు వెళ్లకుండా డుమ్మా కొట్టడం అంటే తప్పు చేశానని చెప్పకనే చెప్పినట్లు అవుతుందని , అయితే ఈ విషయంలో కవితను ఆమె తరుపు లాయర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయకోవిదులు అంటున్నారు.