
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నాడు. ఈనెల 24 న కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకొని అంజన్న ఆశీర్వాదం తీసుకోనున్నాడు. అలాగే ధర్మపురి ఆలయాన్ని కూడా దర్శించుకోనున్నాడు. కొండగట్టు , ధర్మపురి ఆలయాల దర్శన అనంతరం జనసేన కార్యకర్తలు , నాయకులతో సమావేశం కానున్నాడు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేయాలని తెలంగాణ నాయకులు కోరుతుండటంతో పవన్ కళ్యాణ్ కూడా అందుకు సమ్మతించాడు. అందుకే కార్యకర్తలను సన్నద్ధం చేసెందుకు సన్నాహాలు చేస్తున్నాడు.