
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా దేశ వ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ నుండి బండి సంజయ్ , విజయశాంతి , కిషన్ రెడ్డి , ఈటల రాజేందర్ , పొంగులేటి సుధాకర్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి , లక్ష్మణ్ , డీకే అరుణ , జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో బండి సంజయ్ పై ప్రశంసలు కురిపించారు. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు తెలంగాణలో అద్భుతమైన స్పందన వస్తోందని , అలాగే బండి సంజయ్ అనర్గళంగా మాట్లాడగలడని దాంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని ……. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని బండి సంజయ్ లాగే మీరు కూడా మీమీ రాష్ట్రాల్లో పాదయాత్రలు చేయాలన్నారు మోడీ. బండి సంజయ్ గురించి పదేపదే మోడీ ప్రస్తావించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు బండి. మొత్తానికి బండి సంజయ్ త్వరలోనే మరింత అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది.