ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అసలు ఈనెల 19 నే తెలంగాణలో మోడీ పర్యటించాల్సి ఉండే అయితే వందే భారత్ ట్రైన్ స్వల్పంగా ధ్వంసం కావడంతో పాటుగా మోడీ చాలా బిజీగా ఉండటంతో ఆ పర్యటన వాయిదా పడింది.
ఇక ఫిబ్రవరి13 న తెలంగాణ పర్యటన ఖరారైన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ పై దృష్టి సారించింది. ఇక మోడీ కంటే ముందుగానే ఈనెలలో 28 న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నాడు. అగ్ర నాయకులు తెలంగాణ లో వరుస పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో కాషాయ దళంలో సరికొత్త జోష్ వస్తోంది.