తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఈనెల 18 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండగా ఆ మరుసటి రోజున జనవరి 19 న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నాడు. సికింద్రాబాద్ లో వందేభారత్ రైలును ప్రారంభించనున్నాడు. అలాగే దాదాపు 700 కోట్ల తో చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన తో పాటుగా ప్రారంభోత్సవాలు చేయనున్నాడు.
అలాగే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నాడు. అంటే తప్పకుండా కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేయడం ఖాయం. అలాగే ఈనెల 18 న ఖమ్మంలో ప్రసంగించనున్న కేసీఆర్ కూడా మోడీ పై మరోసారి ఘాటు విమర్శలు చేయడం ఖాయం. ఇక అంతకంటే ముందే ఈనెల 17 న కాంగ్రెస్ పార్టీ కూడా సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది. దాంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆరోపణలు , ప్రత్యారోపణలతో మూడు రోజుల పాటు గరం గరం గా సాగనుంది.