తెలంగాణలో సీబీఐకి అనుమతి లేదని కేసీఆర్ సర్కారు హుకుం జారీ చేసినప్పటికీ ……..కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తెలంగాణలో అడుగుపెట్టింది. డిసెంబర్ 6 న కవిత ను విచారిస్తామని చెప్పిన సీబీఐ అన్నట్లుగానే హైదరాబాద్ లో అడుగు పెట్టింది. దాంతో కవిత ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఒకవైపు సీబీఐ అధికారులు కోఠి లోని సీబీఐ కార్యాలయంలో ఎదురు చూస్తున్నారు కవిత కోసం.
అయితే నాకు ఖాళీ లేదు …… ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 6 కు బదులుగా డిసెంబర్ 11 , 12 , 14 , 15 తేదీలలో ఏదో ఒకరోజు నిర్ణయించండి అని కోరింది కవిత. అయితే సీబీఐ నుండి మాత్రం ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏం జరుగనుంది అనే టెన్షన్ నెలకొంది. కవిత ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో నాయకులు , కార్యకర్తలు తరలివచ్చారు.
ఇక సీబీఐ ముందున్న ఆప్షన్ ఒక్కటే …… కోర్టు అనుమతి తీసుకొని కవితను విచారించడమే !మరి సీబీఐ ఆ పని చేస్తుందా ? కవిత చెప్పిన తేదీలలో ఒకదాన్ని ఎంచుకుంటుందా ? అనేది చూడాలి. ఈ సంఘటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది.