
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హైదరాబాద్ కు వస్తుండటంతో రాష్ట్రపతికి స్వాగతం పలకాలని నిర్ణయించారు కేసీఆర్. గత కొంత కాలంగా మోడీ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్. మోడీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు కేసీఆర్. రాష్ట్రపతిగా ముర్ము తెలంగాణకు శీతాకాల విడిది కోసం వస్తున్నారు. దాంతో రాష్ట్రపతికి గౌరవం ఇవ్వాలి కాబట్టి , కేసీఆర్ ఒక్కరే కాకుండా మొత్తం BRS ఎమ్మెల్యేలను , ఎమ్మెల్సీ లను హైదరాబాద్ కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రపతి ముర్ము ఈనెల 30 వరకు తెలంగాణలో అలాగే ఏపీలో పర్యటించనున్నారు. దాంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, మేడారం , భద్రాచలం తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు ద్రౌపది ముర్ము.