తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఇన్వెస్ట్ మెంట్ మీటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు చేరుకున్న భగవంత్ మాన్ కు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ , పంజాబ్ రాష్ట్రాల రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాల గురించి చర్చించారు. చర్చల అనంతరం ప్రగతి భవన్ నుండి నేరుగా తాజ్ కృష్ణ కు చేరుకున్నారు. అక్కడ సమావేశంలో పాల్గొన్న అనంతరం పంజాబ్ కు వెళ్లనున్నారు. ఇటీవలే కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఢిల్లీ లో ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో కేసీఆర్ కు అభినందనలు తెలియజేసారు భగవంత్ మాన్.