గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. కేటీఆర్ సార్ …… మేయర్ గద్వాల విజయలక్ష్మీని కుక్కల గుంపులో పడేయండి అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు మేయర్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసాడు కూడా.
గత ఆదివారం రోజున హైదరాబాద్ లోని అంబర్ పేటలో నాలుగేళ్ళ చిన్నారిని ఆరు కుక్కలు పీక్కుతిన్న విషయం తెలిసిందే. కుక్కలదాడిలో ఆ బాలుడు చనిపోయాడు దాంతో వైరల్ గా మారింది ఈవార్త. ప్రజలందరినీ తీవ్రంగా కలిచి వేసింది ఆ వార్త. అయితే ఈ సంఘటనపై స్పందించిన మేయర్ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. దాంతో మండిపడుతున్నారు సెలబ్రిటీలు , నెటిజన్లు.
ఇంతకీ మేయర్ ఏమన్నారో తెలుసా …….. కుక్కలకు ఆకలి వేసి బాలుడి మీద దాడికి పాల్పడ్డాయని , ఆ కుక్కలకు ఓ మహిళ ప్రతీ రోజు మాంసం పెడుతుందని , ఆమె రెండు రోజులుగా లేకపోవడంతో , ఆహారం లేక ఆకలితో బాలుడిపై కుక్కలు దాడి చేశాయని , ఇక ఈ సంఘటనలో GHMC తప్పు లేదని చెప్పడమే ఆగ్రహానికి కారణం.
మేయర్ వ్యాఖ్యలు దర్శకుడు రాంగోపాల్ వర్మ ను తీవ్రంగా బాధించాయి దాంతో ఘాటుగా స్పందించాడు. కేటీఆర్ సార్ …. మేయర్ ను కుక్కలగుంపులో పడేయండి అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి వాటికీ ఆహారం పెట్టండి అప్పుడే నగరవాసులకు భద్రత అంటూ ట్వీట్ చేసాడు వర్మ.