
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 6 న పాదయాత్ర ప్రారంభించనున్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఈ పాదయాత్ర ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందో తెలుసా……. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ ప్రాంగణం నుండి. ములుగు ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గమైన ములుగు నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించాడు రేవంత్ రెడ్డి. సీతక్క తనకు సోదరితో సమానమని పలుమార్లు స్పష్టం చేశాడు రేవంత్ దాంతో సిస్టర్ సెంటిమెంట్ తో పాటుగా వీరనారిమణులు సమ్మక్క – సారలమ్మ ల పోరాట పుణ్యక్షేత్రమైన తాడ్వాయి నుండి పాదయాత్ర ప్రారంభించనున్నాడు.
ఫిబ్రవరి 6 న భారీ ఎత్తున ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ని ఆహ్వానిస్తున్నారు. అలాగే పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ ఠాక్రే కూడా పాల్గొననున్నాడు. మొత్తంగా తెలంగాణ లోని 50 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నాడు.