పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చౌక్ లో కేసీఆర్ సర్కారు నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ ధర్నా చేయాలని నిర్ణయించారు. పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అయితే ధర్నా కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక రేవంత్ రెడ్డి పోలీసుల కళ్ళు గప్పి పలుమార్లు సంఘటనా స్థలానికి చేరుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈసారి ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజామునే రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.
Breaking News