ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి . ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. రోహిత్ రెడ్డి లాయర్ తరుపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం , ఈడీ డైరెక్టర్, ఈడీ లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 జనవరి 5 కు వాయిదా వేసింది.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎలాంటి డబ్బు దొరక్క పోయినా మనీ లాండరింగ్ కేసు అంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈడీ పై తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు రోహిత్ రెడ్డి.