
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక కోళ్ల పందాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ అనే విషయం తెలిసిందే. సామాన్యుల నుండి మంత్రుల వరకు కూడా ఆ సంబరాల్లో మునిగిపోతారు. మొత్తానికి చాలా సరదా వాతావరణం నెలకొంటుంది అక్కడ. అయితే ఏపీలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా వ్యవహరించినా నడిచింది కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.
అలాంటి పరిస్థితుల్లో ఏపీ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే అలాగే అభివృద్ధిపథంలో పయనించేలా చేయాలంటే శక్తివంచన లేకుండా కృషి చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా సంబరాలు చేసుకుంటూ పాలను పక్కన పెట్టేసారు. పోలవరం 2021 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం 2023 వచ్చినా పోలవరం ఊసే లేకుండా పోయింది. అలాగే ఏపీలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజకీయంగా కూడా దాడులు , ప్రతి దాడులతో సతమతం అవుతోంది. పెట్టుబడులు కూడా ఏపీ కి రావడం లేదు సరికదా ……. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన సంస్థలు ఏపీ నుండి వెళ్లిపోతున్నాయి. దాంతో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండాపోతున్నాయి.
AP పరిస్థితి అలా ఉంటే ఇక తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది తెలంగాణ. పెద్ద ఎత్తున పలు సంస్థలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇక ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. దాంతో తెలంగాణలో ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. అందుకే తెలంగాణకు వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యంగా ఏపీ నుండి పెద్ద ఎత్తున యువత హైదరాబాద్ కు తరలి వస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో నాయకులు కోళ్ల పందాలతో సంబరాలు చేసుకుంటూ తలమునకలైతే ……. తెలంగాణలో మాత్రం మంత్రి కేటీఆర్ పెట్టుబడుల కోసం పర్యటనలు చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాడు. పండగ చేసుకోవడం కాదు…… యువతకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే అసలైన పండగ అనే సంకేతాలు ఇస్తున్నాడు.