
వందే భారత్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని అనుకున్న ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఎందుకంటే …….. వందే భారత్ రైలు ఇటీవలే ప్రారంభం కావడం …… ఆ ట్రైన్ చూడముచ్చటగా ఉండటంతో ఆ ట్రైన్ ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి ఏ వ్యక్తి ట్రైన్ ఎక్కాడు. లోపలి నుండి సెల్ఫీ తీసుకున్నాడు అయితే వెంటనే ట్రైన్ స్టార్ట్ అయ్యింది.
అంతే వేగంగా ఆ ట్రైన్ దిగడానికి రకరకాల ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు ఎందుకంటే ……. ట్రైన్ ప్రారంభం అయ్యే ముందు డోర్స్ లాక్ అవుతాయి. దాంతో లోపలే ఉండిపోయాడు. వెంటనే టీసీ వచ్చి పిచ్చి తిట్టుడు తిట్టాడు ఆ వ్యక్తిని. సెల్ఫీ తీసుకోవడానికి లోపలకు వస్తావా ? విజయవాడ వరకు ఆగాల్సిందే ….. ట్రైన్ లోనే ఉండిపోవాల్సిందే ….. అంతేకాదు 6 వేల రూపాయల ఫైన్ కట్టాల్సిందే అని హుకుం జారీ చేసాడు. దాంతో ఆ వ్యక్తి బాధ చెప్పనలవి కాదు . హైదరాబాద్ నుండి విజయవాడ వరకు రాను పోను మొత్తం 12 గంటల ప్రయాణం అలాగే 6 వేల ఫైన్ కూడా పడటంతో ఆ వ్యక్తి లబోదిబో మంటున్నాడు.