
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి గట్టిగా కౌంటర్ ఇచ్చింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సజ్జల పై షర్మిల కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా…….. వీలైతే మళ్లీ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ కలపాలని …… పూర్వపు ఆంధ్రప్రదేశ్ ను మా ప్రభుత్వం కోరుకుంటోందని వ్యాఖ్యానించడమే.
తెలంగాణ కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసారని, ఎంతోమంది బలిదానాలతో , త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ, అలాంటి తెలంగాణ ను మళ్లీ ఏపీతో ఎలా కలుపుతారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపడం అన్నది అసాధ్యం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదు. మీ ధ్యాసంత మీ రాష్ట్ర అభివృద్ధి కోసం అంతేకాని మళ్లీ ఏపీ తెలంగాణ ను కలపాలని ఆలోచించడం తగదు అంటూ సజ్జలకు చురకలు అంటించింది షర్మిల.