
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణీస్తోంది. గత 30 గంటలుగా లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో తన పాదయాత్రకు కేసీఆర్ ప్రభత్వం అనుమతి ఇవ్వాలని ట్యాంక్ బండ్ మీద మెరుపు ధర్నా చేసింది. దాంతో పోలీసులు షర్మిల ను అరెస్ట్ చేసి ఇంటికి తరలించారు.
అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని కుండబద్దలు కొట్టిన షర్మిల నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తోంది. నిన్నటి నుండి కనీసం మంచి నీళ్లు కూడా తాగకపోవడంతో షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని ఆమెను పరీక్షించిన వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేసారు.
యూరియా లెవల్స్ పడిపోతున్నాయి , బీపీ లెవల్స్ కూడా పడిపోయాయి . లాక్టేట్ లెవల్స్ బాగా పెరిగాయి , గ్లూకోజ్ లెవల్స్ తగ్గాయి. దాంతో షర్మిల ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరించారు. డాక్టర్ల సూచనతో షర్మిలను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించాలనే నిర్ణయానికి వచ్చారట పోలీసులు.