
తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సాధారణంగా తెలంగాణ అసెంబ్లీకి 2023 డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాలి. అంటే 2023 అక్టోబర్ నుండి నవంబర్ లోపు ఎన్నికలను పూర్తి చేయాలి. అయితే అప్పటి వరకు ఆగితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింతగా పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి కర్ణాటకతో పాటే 2023 వేసవిలోనే ఎన్నికలు పూర్తి కానిచ్చేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసారట.
ఇలా కర్ణాటకతో పాటుగా ఎన్నికలకు వెళ్లడం వల్ల లాభనష్టాలను బేరీజు వేసుకున్నాడట. దాంతో అన్నింటికీ సిద్దమై కర్ణాటక ఎన్నికలతో పాటుగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగితే లాభం చేకూరుతుందని భావిస్తున్నాడట. అందుకే ఈలోపు ప్రజలకు ఇచ్చిన హామీలలో మిగతావాటిని శరవేగంగా పూర్తి చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడట కేసీఆర్.