
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నిన్న సాయంత్రం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎనిమిది అంతస్తులున్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున షాపులు , ఆఫీసులు ఉన్నాయి. మొత్తంగా 400 వరకు ఆఫీసులు , షాపులు , గోడౌన్ లు ఉన్నాయి.
మొత్తం 14 మందిని రెస్క్యూ చేసిన అగ్నిమాపక సిబ్బంది అందులో చిక్కుకున్న ఆరుగురిని మాత్రం కాపాడలేకపోయింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఆ పొగలో ఎటూ వెళ్లలేక అచేతనంగా పడిపోయారు. పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో అపస్మారక స్థితిలో చేరుకున్నారు. వాళ్ళను ఎంతో కష్టించి బయటకు తీసుకువచ్చినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే మరణించారని డాక్టర్లు తెలిపారు. చనిపోయిన వాళ్లలో ప్రమీల , త్రివేణి , శ్రావణి , శివ , ప్రశాంత్ , వెన్నెల ఉన్నారు.
అయితే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో బిల్డింగ్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు అధికారులు. పురాతనమైన బిల్డింగ్ కావడంతో పాటుగా మంటలు చెలరేగడంతో స్వప్నలోక్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అపార్ట్ మెంట్ వాసులను అలాగే బస్తీవాసులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.