
వరంగల్ జిల్లా కేంద్రంలో శ్రీ భద్రకాళీ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా కొలవబడుతోంది. దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలలో భద్రకాళీ అమ్మవారి దేవాయలం కూడా ఒకటి. భద్రకాళీ చెరువుని అనుకొని ఉన్న ఈ గుడి చాలా మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంలా నిలిచింది.
శ్రీ భద్రకాళీ అమ్మవారి టెంపుల్ ప్రధాన అర్చకులు శేషు అమ్మవారి విశేషాలను వెల్లడించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించే పద్దతిని వివరించారు. అలాగే అమ్మవారి దేవాలయం ఇంత ఆకర్షణగా నిలవడానికి గల కారణాలను వెల్లడించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేస్తారన్నారు. శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయం విశేషాలను JSW & Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. భద్రకాళీ అమ్మవారి దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూని కింద యూట్యూబ్ లింక్ ద్వారా చూడండి.