
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోయిన సంఘటన ఇంకా మరువకముందే మరో సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. అయిదేళ్ల బాలుడ్ని వీధి కుక్కలు నిర్దాక్షిణ్యంగా చంపేశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం పుటాని తండాలో ఈ దారుణం జరిగింది. బానోతు రవీందర్ – సంధ్య ల కుమారుడు బానోతు భరత్ (5) గ్రామంలో ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒకసారిగా దాడి చేసాయి.
గాయాలపాలైన బాలుడ్ని వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడంతో ఆ బాలుడ్ని తీసుకొని బస్సులో హైదరాబాద్ కు బయలుదేరుతున్న సమయంలో బస్సులోనే మరణించాడు. దాంతో విగతజీవిగా మారిన తమ కొడుకును చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. గ్రామానికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.