
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సన్ స్ట్రోక్ తగిలింది. క్యాసినో కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఈడీ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని , తనపై వస్తున్న వార్తలను ఖండించాడు. క్యాసినో కేసులో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ ను ఈడీ విచారణకు పిలిచింది.
దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది. అంతేకాదు ఆరేళ్ళ బ్యాంక్ స్టేట్ మెంట్ కూడా సేకరిస్తోంది. దాంతో ఈ కేసులో తలసాని తనయుడు సాయి కిరణ్ ను కూడా ఈడీ విచారణకు పిలవడం ఖాయమని తెలుస్తోంది. తలసాని సాయి కిరణ్ 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.