
తనకు ఈడీ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈడీ విచారణ పై స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత. అయితే సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది. కవిత కు షాకిచ్చింది సుప్రీం కోర్టు. ఈడీ నోటీసుల విషయంలో తనకు స్టే ఇస్తుందని భావించింది కవిత. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈనెల 16 న కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. మార్చి 11 న 9 గంటల పాటు కవిత ను విచారించింది ఈడీ. ఇక రేపు ఎన్ని గంటలు విచారణ సాగుతుందో చూడాలి. అయితే తనకు ఈడీ విచారణ నుండి విముక్తి కల్పించాలని సుప్రీం ను ఆశ్రయించినప్పటికీ లాభం లేకపోయింది. అయితే కవిత పిటీషన్ పై తదుపరి విచారణ మాత్రం మార్చి 24 న చేస్తామని ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.