
ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను నిలిపివేయాలని, అలాగే తన పిటిషన్ ను త్వరగా విచారించాలని ఈరోజు ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు కవిత రిట్ పిటీషన్ ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈనెల 24 న మాత్రమే రిట్ పిటీషన్ ను విచారిస్తామని తేల్చి చెప్పింది. దాంతో ఈనెల 20 న ఈడీ విచారణకు కవిత వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.