
Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే తీన్మార్ మల్లన్న ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నామని Q న్యూస్ సిబ్బందికి సమాచారం అందించారు. అంతేకాదు Q న్యూస్ ఆఫీసులోని సిబ్బందిని బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దాంతో సిబ్బంది అంతా వెళ్లిపోయారు. తీన్మార్ మల్లన్న ఆఫీసులో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. దాదాపు 50 మంది పోలీసులు తీన్మార్ మల్లన్న ఆఫీసుకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.