
తెలంగాణ గవర్నర్ తమిళిసై నడుస్తూ నడుస్తూ కిందపడ్డారు దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. ఈ సంఘటన తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. తమిళనాడులో హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. కాగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమిళి సై. గవర్నర్ నడుస్తున్న సమయంలో కింద వేసిన మ్యాట్ కాలుకు తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది , ఇతర అధికారులు , నిర్వాహకులు ఆందోళన చెందారు.
అయితే వెంటనే తేరుకున్న గవర్నర్ లేచి నిలబడింది. గాయాలు పెద్దగా కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు స్వల్ప గాయాలు అయినప్పటికీ వాటిని లెక్కచేయకుండా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంది. అయితే గవర్నర్ కార్యక్రమంలో పాల్గొంటుంది అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా మ్యాట్ వేసిన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు గవర్నర్ సెక్యూరిటీ.